"Ascharyame Ascharyame" Song Info
Ascharyame Ascharyame/ ఆశ్చర్యమే ఆశ్చర్యమే Song Lyrics
క్రీస్తేసు పుట్టెను మన కొరకై పుట్టెను
ఓ కన్యసుతుడై నీకొరకే నాకొరకే ఇలలోకే వచ్చేను
చీకటినే తొలగించెను నిజవేలుగై ఉదయించెను
తన మహిమను విడచి మనిషై వచ్చెను
నీకొరకే నాకొరకే ఇలలోకే వచ్చేను
ఆశ్చర్యమే ఆశ్చర్యమే బహు ఆశ్చర్యమే
ఆనందమే ఆనందమే బహు ఆనందమే
ఆకాశ నక్షత్రము ఆశ్చర్యమే
ఆదిసంభూతుడేసుని జననం ఆనందమే
ఆకాశ నక్షత్రము ఆశ్చర్యమే
ఆదిసంభూతుడేసుని జననం ఆనందమే
ఆరాదించగ రారండి జ్ఞానులారా
ఆశ్చర్యకరుడేసుని లోకరక్షకుడేసుని
ఆరాదించగ రారండి కాపరులారా
ఆలోచనాకర్తను మన ప్రభుయేసుని
ఆశ్చర్యమే ఆశ్చర్యమే బహు ఆశ్చర్యమే
ఆనందమే ఆనందమే బహు ఆనందమే
ఆదియందున్న దేవుని వాక్యము
ప్రత్యక్షమాయెను ఈ భువిజనులకు
వాక్యమైయున్న ఆ దేవుడే
శిశువాయి పుట్టెను నీకొరకు నాకొరకే
ఆత్మ రూపుడైన దేవుడు శారీరరూపము ధరించి
ఆశీర్వాదపూర్ణుడై నరునిగా భువికేగెను
ఆత్మ రూపుడైన దేవుడు శారీరరూపము ధరించి
ఆశీర్వాదపూర్ణుడై నరునిగా భువికేగెను
ఆరాదించగ రారండి జ్ఞానులారా
ఆశ్చర్యకరుడేసుని లోకరక్షకుడేసుని
ఆరాదించగ రారండి జ్ఞానులారా
ఆలోచనాకర్తను మన ప్రభుయేసుని
ఆశ్చర్యమే ఆశ్చర్యమే బహు ఆశ్చర్యమే
ఆనందమే ఆనందమే బహు ఆనందమే
ఆశ్చర్యకరమైన ప్రేమను
మనపై చూపిననాడు ఆ ప్రేమనాధుడు
మనపాప శాపములన్నీ తొలగింప
పరిశుద్ధ రక్తమును చిందించెను మనకై
ఆశ్రయించువారిని క్షమియించి రక్షించును
ఆశ్చర్య కరమైన వెలుగులోనికి నడుపును
ఆశ్రయించువారిని క్షమియించి రక్షించును
ఆశ్చర్య కరమైన వెలుగులోనికి నడుపును
ఆరాదించగ రారండి జ్ఞానులారా
ఆశ్చర్యకరుడేసుని లోకరక్షకుడేసుని
ఆరాదించగ రారండి జ్ఞానులారా
ఆలోచనాకర్తను మన ప్రభుయేసుని
ఆశ్చర్యమే ఆశ్చర్యమే బహు ఆశ్చర్యమే
ఆనందమే ఆనందమే బహు ఆనందమే
%20(1).jpg)
0 Comments