Amarudavu neevu naa yesayya Song Lyrics
అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా

ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో

సొమ్మసిల్లక - సాగిపోదును - సీయోను మార్గములో
స్తోత్రగీతము - ఆలపింతును - నీదివ్య సన్నిధిలో

శక్తికి మించిన సమరములో - నేర్పితివి నాకు నీ చిత్తమే
శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే

ప్రతి విజయము నీకంకితం - నాబ్రతుకే నీ మహిమార్థం
లోకమంతయు - దూరమైనను - ననే చేరదీసెదవు
దేహమంతయు - ధూళియైనను - జీవింపజేసెదవు
అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా
అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా
వేకువకురిసిన చిరుజల్లులో - నీకృప నాలో ప్రవహించగా
పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము

తీర్చగలనా నీ ఋణమును - మరువగలనా నీ ప్రేమను
కన్నతండ్రిగ - నన్ను కాచి - కన్నీరు తుడిచితివి
కమ్మనైన - ప్రేమ చూపి - కనువిందు చేసితివి
అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా
అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా
జల్దరు వృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా
మరణము గెలిచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా

జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతి నిత్యము
గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన
ఆత్మదీపము - వెలిగించినావు - నీకే ఆరాధన

0 Comments